18-9-2020 (సెప్టెంబర్ ) శుక్రవారం నుండి అధిక ఆశ్వీయుజ మాసం ఆరంభం. (16-10-’20 వరకు).
ముహూర్తాలుండవు. శుభ కాలం కాదు.
మరల 17.10.’20 నుంచి నిజ ఆశ్వీయుజ మాసం ఆరంభం. అది శుభ కాలం ముహూర్తాలున్నాయి.
ఈ 2 మాసాల్లో నూ శుభ కార్యాలు నిషిద్దం గనుక ఒకటే నని అనుకుంటాo! కానీ కొంచెం తేడా వుంది. 18.9.’20 శుక్రవారం నుoచి అధిక ఆశ్వీయుజ మాసం ఆరంభం. అధిక మాసం సహజంగా 2, 3 సం. లకు ఒకసారి చొప్పున వస్తూ వుంటుంది.
అదే శూన్య మాసం అయితే ఒకే సం. లో 2,3 సార్లు వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఇంకా ఎక్కువ సార్లు కూడా వస్తుంది. మొత్తం 12 రాసులను చర, స్థిర, ద్వి స్వభావ రాసులు గా విభజించారు. వీటిలో ద్విస్వభావ రాశు లైన మిధున0, కన్య, ధనుస్సు, మీనం వంటి రాశుల లో సూర్యుడు సంచారం చేసే కాలాన్ని (మాసాన్ని) శూన్య మాసం అంటారు. ఇది శుభకాలం కాదు.
వివా హాలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాల వంటివి నిషిద్దం అంది శాస్త్రం. అలాగే, అధిక మాస0 అంటే …. ఒక్కొక్కప్పుడు ఒకే రోజు న రెండు తిథులు మారుతుoటాయి. కొన్ని తిథులు తక్కువ కాలం, కొన్ని యెక్కువ కాలం వుంటాయి. ఈ యెక్కువ, తక్కువ ల వలన 12 మాసాలు కాక ఒక మాసం అధికo అవుతుంది. అలా అధికoగా వచ్చిన మాసాన్నే అధిక మాసం అని పిలుస్తారు.
ఇప్పుడు ఆశ్వీయుజం లో వచ్చింది కాబట్టి అధిక ఆశ్వీయుజ మాసం అన్నారు. వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు నిషిద్దం ఇలాంటి మాసాల్లో. అయితే పితృకార్యాల కు మంచిదని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆధ్యాత్మిక సాధన కు కూడా. ఇదీ చూచాయి గా… అథిక, శూన్య మాసాల కు తేడా! శుభం.
Jyotish Praveen SRAVAN, Vedic Predictions & Remedies Bank, Hyb., Delhi.
e-mail: predictionsbank@gmail.com
Leave a Reply